Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

378..
నా మనసే ఓ ఖాళీ..మధుపాత్రై..వేచినదే..!
నీ తలపుల సుధను.. కోరు జాబిలియై..వేచినదే..!
ఊరించే ప్రతి రేయిని..ముక్కలేల చేస్తావో..?!
కలహించే విరహ బాధ..తెలి మబ్బై..వేచినదే..!
గోరింటకు పులకింతను..కానుకివ్వ రావేలా..!?
గువ్వ పిట్ట గుబులేమో..గోరొంకై..వేచినదే..!
అడుగంటిన ఆశ గొడవ..తీర్చేందుకు జాగేలా..!
కోకిలమ్మ వేదనయే..ఓ చిగురై..వేచినదే..!
సంతసాల పానశాల..పాల పుంత ఏదోయీ..?!
వింతగొలుపు కవ్వింతల..కలహంసై..వేచినదే..!
'మాధవు'నకు..వేడుకౌనె..?! నీవు నన్ను ఉడికించిన..
ప్రియ సఖియా..నా ప్రేమయె..చిరు లేఖై..వేచినదే..!
 

వేచినదే..!
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.