గజల్ 3750.
పెనంమీది దోసెపిండి..మాడకుండ చూడాలిక..!
చెలిముద్దుల సందడింత..చెదరకుండ దాచాలిక..!
పచ్చి ఉల్లి పాయకన్న..మేలుచేయు పదార్థమా..
"కోవిడ్" కే చెక్ పెట్టగ..వదలకుండ వాడాలిక..!
నిమ్మరసం అల్లం మరి..పుదీనాలు మంచివి కద..
తులసీ దాల్చినచెక్కలు..తప్పకుండ కలపాలిక..!
ఖర్జూరం బొప్పాయీ..పుచ్చపండ్లు సరేసరే..
దొరకకున్న ఆవేదన..చెందకుండ ఉండాలిక..!
యోగా వాకింగ్ ఇంకా..ప్రాణాయమం అవసరం..
భౌతికదూరం మాత్రం..మరువకుండ కాచాలిక..!
మాంసాహారం గుడ్లు సహా మానడం ఉత్తమ..
మాధవుడా నీ ధ్యానం..ఆగకుండ సాగాలిక..!