403..
అక్షరాల అడవిలోన మిగిలినాను ఎందులకో..!?
మనసు గొడవ జలధిలోన మునిగినాను ఎందులకో..!?
ప్రేమ లేఖ వ్రాయాలను ముచ్చటలో..ఓ సఖియా..!
జన్మ లెన్నొ ఒక వెర్రిగ..గడిపినాను ఎందులకో..!?
నీ సొగసులు వర్ణించగ చేతగాక మూగబోతి..!
నిజమేదో తెలియకనే..రగిలినాను ఎందులకో..!?
ప్రేమ తెలుప భాషలేవి సరిపోవని తేలిపోయె..!
ఆవేదన తీరకనే..మరిగినాను ఎందులకో..!?
కలువలేల అలిగినవో.. జాబిలిపై చిత్రముగా..!
ఆ సంగతి..అర్థమవక..వేగినాను ఎందులకో..!?
నీ బంగరు నగవుల నది..లే గులాబి నవలేనా..?!
'మాధవు'నే అడుగుటకే..వేచినాను..ఎందులకో..!?
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు