479..
నీ చూపుల వెన్నెలలో ~ కరిగిపోయె నా మనస్సు..!
నీ తలపుల స్పర్శలలో ~ ఇగిరిపోయె నా మనస్సు..!
ఏ తోటను ఈ భువిలో ~ దొరకవుగా ఆ పూవులు..!
నీ పరిమళ దారులలో ~ ఒదిగిపోయె నా మనస్సు..!
ఎందుకలా నవ్వుతావు ~ సిరిమువ్వల నాదంలా..!
ఆ సవ్వడి జల్లులలో ~ మురిసిపోయె నా మనస్సు..!
రగులుతున్న స్వప్నాలను ~ కాల్చు అగ్ని శ్వాస నీది..!
ఆ వెచ్చని జ్వాలలలో ~ తడిసిపోయె నా మనస్సు..!
ప్రతి కణమున ప్రతిధ్వనుల ~ ప్రవహించే మౌనమీవు..!
ప్రతిబింబ'పు సొగసులలో ~ బ్రతికిపోయె నా మనస్సు..!
ఈ రాధను..ఆ'రాధాగ ~ మార్చుకున్న ''మాధవుడా''..!
నీ పదముల మధువులలో ~ తేలిపోయె నా మనస్సు..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు