480..
పరిమళించు మల్లియలా నీ మాటను ఒలికించూ..!
ప్రతి క్షణం మౌనంగా నీ ప్రేమను అందించూ..!
దైవమెలా ఉంటుందని ప్రశ్న ఎవరు వేస్తేనేం..!
జవాబుగా సుతిమెత్తని చూపుసుధను వర్షించూ..!
వెన్నకన్న మృదువైనది మనసేనని చెప్పాలా..!
గగనాలను దాటించే నీ శ్వాసను గమనించూ..!
హాయియొక్క చిరునామా మేఘమాల చెబుతుంది..!
కలహంసల సాక్షియైన నీ నడకను పరికించూ..!
ఆరిపోని సుస్వరాగ్ని గానమెలా ఉంటుందో..!?
నాట్యమాడు దరహాసపు పవనాలను శోధించూ..!
రాధలాగ నీవైతే..'మాధవు'డే అలరించును..!
పట్టుదలగ తిరుగులేని విజయాలను సాధించూ..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు