500..
అక్షరాల ఆకాశం తీసుకునే శ్వాస చూడు..!
అందమైన ఆ మౌనం వర్షించే శ్వాస చూడు..!
నిన్ను నీకు పట్టిచ్చే అమృతమది నీ చూపే..!
ఓర్చలేని బంధనాలు వదిలించే శ్వాస చూడు..!
మోసమేది లేదు సఖా నీ తలపే దీపమౌను..!
సరసరాగ దీపికలను నడిపించే శ్వాస చూడు..!
నిత్య మందహాసాలకు పుట్టినిల్లు నీ హృదయం..!
ఆ కోవెల ద్వారాలను రవళించే శ్వాస చూడు..!
ప్రతి కణమొక కోటివేణు సమూహమని తెలిసేందుకు..
నిలచియున్న అరకన్నుల ప్రవహించే శ్వాస చూడు..!
'మాధవు'నకు కావాలట తూచ రాని నీ స్నేహం..!
మెలకువలకు మూలమౌతు బ్రతికించే శ్వాస చూడు..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు