519..
హృదయసంద్ర తీరాలను.. మురిపించిన సఖి నీవే..!
దివ్యమౌన గగనాలను.. దాటించిన సఖి నీవే..!
అక్షరాల గళములలో పలుకుతేనె లుప్పొంగగ.
మనసు వీణ రాగాలను.. రవళించిన సఖి నీవే..!
నీ చిరునవ్వే గులాబీల వనమైనది వెన్నెలలో..
పరిమళించు పవనాలను.. అలరించిన సఖి నీవే..!
నీ పాపిట ఒదిగియున్న.. సిందూరపు వాకిలిలో..
వేచియున్న పరువాలను..మెప్పించిన సఖి నీవే..!
పాడరాని భావాలకు..సాక్ష్యమైన శ్వాసలలో..
తొంగిచూచు వేదాలను..అందించిన సఖి నీవే..!
మెలకువలకు కువకువలను రంగరించు 'మాధవు'నకు..
తెలియనట్టి నాదాలను..వివరించిన సఖి నీవే..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు