523..
నీ నవ్వుల కోవెలలో ~ కిరణమైన చాలునులే..!
నీ పాటల వెన్నెలకో ~ చరణమైన చాలునులే..!
ఏ గులాబి తోటలోని ~ పరిమళాల సంగతేమొ..?!
నీ అడుగుల నీడల ఆ'భరణమైన చాలునులే..!
వర్ణాలకు లొంగని నీ - ప్రేమలోక మెంతటిదో..?!
నీ తియ్యని పదముల ఆ'వరణమైన చాలునులే..!
ఇంద్రచాప రాగాలకు ~ సొగసులేల నింపేవో..?!
నీ ప్రేమగ మిగులు ఉపకరణమైన చాలునులే..!
కనులముందు జాతరలో ~ కలహంసల వీధులెచట..!?
నీ పలుకులమాటు వివరణమైన చాలునులే..!
ఓ 'మాధవ' హారతిగా ~ నీకివ్వగ ఏమున్నది..?!
నీ కొలువున అక్షర శ్రీ వరణమైన చాలునులే..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు