536..
మనసుపడే ఆరాటం..జన్మగానె మారుతోంది..!
ఆశ మాటు పోరాటం..వెలితిగానె మారుతోంది..!
చింతలేని బ్రతుకు కొరకు..ఎంత చింత అందరికీ..
చీకటింటి వెతుకులాట..అగ్గిగానె మారుతోంది..!
ప్రేమకొరకు తిరుగనేల..పంతాలను వీడకుండ..?!
మనసుగొడవ తీరకనే..రాయిగానె మారుతోంది..!
స్నేహనిధిని దాచుకున్న చెట్టు యోగనిదుర లోన..
నేను,నాది విడచి తాను..గాలిగానె మారుతోంది..!
పరిమళాలు పంచుతున్న వసంతాల ఆ సందడి..
పరమాన్నం పంచేందుకు..మట్టిగానె మారుతోంది..!
చెలిమివేణు వూదుతున్న 'మాధవు'నకు ఆ 'రాధే..
యుగాలుగా శ్వాసగగన..సాక్షిగానె మారుతోంది..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు