Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

@31-12-15 ముషాయిరా గజల్-2.// 557 //
నన్ను నేను మరచేందుకు..బాధలేదు ఎందుకనో..!?
బ్రతుకు విలువ తెలిపేందుకు..మాట లేదు ఎందుకనో..!?
ప్రేమించుట ఎక్కడుంది..వెన్నెలేల వర్షించును..?!
అది ఏదో నేర్పేందుకు..విద్యలేదు ఎందుకనో..!?
ప్రభుత ఎదో చేస్తుందని.. ప్రతి ఒక్కరి ఎదురుచూపు..
అసలుగుట్టు విప్పేందుకు..యువత లేదు ఎందుకనో..!
స్వార్థమనే అశ్వానికి..పగ్గమెవరు వేస్తారో..?!
సత్యమెదో చెప్పేందుకు..గొడవలేదు ఎందుకనో..!
నిన్ను నేను చూస్తున్నా యుగాలుగా ప్రేమ మీర..
పిచ్చిమనసు వీడెందుకు..కలతలేదు ఎందుకనో..!?
నా తలపుల యమునానది నీవేగా 'మాధవుడా..'!
నీజతలో ఆడేందుకు..పడవలేదు ఎందుకనో..!?

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

బాధలేదు ఎందుకనో
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.