585..
నదిలాగ నవ్వేవు..తియ్యంగ ఎల్లపుడు..!
వెన్నెలై కురిసేవు..చల్లంగ ఎల్లపుడు..!
మదినిండ కొలువుండి..అలరించు వెలుగువే..!
మరుమల్లెవయ్యేవు..మౌనంగ ఎల్లపుడు..!
ఈ పసిడి తనువులో..ఎన్నెన్ని విశ్వాలొ..?!
ప్రతి జన్మ మజిలీకి..ప్రాణంగ ఎల్లపుడు..!
ప్రతి చినుకు గుండెలో..నాట్యాలు చేసేవు..!
మెరుపువే అయ్యేవు..వేగంగ ఎల్లపుడు..!
చూపులో ధారగా..వెన్నంటు చెలియవే..!
రాగమై కురిసేవు..పొంగంగ ఎల్లపుడు..!
నాదాల పాదాల..తారాడు మువ్వవే..!
ఎదలోన మ్రోగేవు..మోదంగ ఎల్లపుడు..!
ఏకణము కాకణము..ధీశక్తి సాగరమె..!
ప్రగతిరథ పయనాన..చక్రంగ ఎల్లపుడు..!
బ్రహ్మాండ భాండాన..తారకా ప్రభ నీవు..!
క్రీడించు స'రసాల..తీర్థంగ ఎల్లపుడు..!
ఈ కనులు మూయగా..మధురమే నిజముగా..!
కలలన్ని కరగించు..ధ్యానంగ ఎల్లపుడు..!
'మాధవా' అనగానె..ప్రత్యక్షమౌతావు..!
గీతార్థ భావాల..సారంగ ఎల్లపుడు..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు