Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

4640..గజల్ 

నీ చూపుల బాణాలే..పానుపులా ఎపుడూ..!
ఎంతప్రేమ గంధమోయి..వర్షములా ఎపుడూ..! 

నీ మౌనం నవమేఘం..అక్షరాల తోడుగ.. 
నీవేమో కరుణించే..వేలుపులా ఎపుడూ..!  

తాళలేని విరహమేమొ..మోస్తున్నది మనసే.. 
ఈ తనువే పరితపించు..వృక్షములా ఎపుడూ..! 

దూకుచినుకు రాగాలను..వినిపించే చెలియా.. 
నీ జతలో ప్రతినిముషం..స్వర్గములా ఎపుడూ..! 

తలపులన్ని రాల్చివేయు..మోక్షమేది ఇంకా.. 
మాయన్నది ఒక వెన్నెల..సరస్సులా ఎపుడూ..! 

భావాలను పండించే..కోకిలమే హృదయం.. 
నా సమాధి నాతోనే..గగనములా ఎపుడూ..! 

మాధవుడా అలలుమీటు..తీరంలా నీవే.. 
తరచిచూడ చిరునవ్వుల..సంద్రములా ఎపుడూ..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు

పానుపులా ఎపుడూ
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.