సైనికా నీకు వందనం
తనకంటు ఒక కుటుంబం ఉందని మరచి - దేశాన్ని తన కుటుంబంగా మార్చుకున్న ఓ సిపాయి నీకు నా వందనం
నువ్వు నాకు అన్నవు కావు తమ్ముడు కావు కనీసం బంధువు కూడా కాదు - కానీ నా రక్షణ కోసం అంతలా పోరాడుతున్న ఓ సైనికా నీకు నా వందనం
నేను మూడు పూటలా తిని కంటి నిండా నిద్రపోవడం కోసం - భయంకరమైన క్లిష్ట పరిస్థితులను సైతం భరిస్తున్న ఓ ధైర్యశాలి నీకు నా వందనం
స్వార్థం అహంకారం గర్వంతో నిండిన నాకోసం - ఏ స్వార్థం లేకుండా అందరూ నావాళ్లే అని చనిపోతానని తెలిసినా నా సంరక్షణ కోసం పరితపిస్తున్న ఓ త్యాగశీలి నీకు నా వందనం
సూర్యచంద్రుల నక్షత్రాల వెలుగు ఎంత ప్రకశమైనదో అంత కంటే ఎక్కువ ప్రేమను చూపిస్తూ ఏమి కానీ నాకోసం ఒక అలుపు ఎరుగని సింహంలా రణరంగంలో తుదిశ్వాస వరకు పోరాడుతున్న ప్రేమమూర్తి నీకు నా వందనం
నెలవల సహజ,
చిత్తూరు జిల్లా.