భావానికి అక్షరరూపం by Amaravati Rajasekhar Sharma (CRTL కవితల పోటీ 2021)
Amaravati Rajasekhar Sharma
భావానికి అక్షరరూపం
భర్తను వదిలి ఉండలేను
అలాగని వెళ్ళకు మని చెప్పలేను
అది రామ సేవన
ఇది ప్రేమ భావన
ప్రేమ ఒక భాగం
రాముడే సర్వస్వం తనకు ..
పరమాత్మ చింతనకు నేనెందుకు అడ్డు
అలాగని ఒంటరిగా...
ఆ ఊహకూడా తట్టుకోలేను
అన్ని సమసీయలకు నిద్రమత్తు
తల్లి లాలన లాంటిది
హాయిగా నిద్రిస్తే
అదోమరో తెలియని లోక విహారం
ఆ వరమడిగేస్తే....
చాలు
ఊర్మిళాదేవి నిద్రగా
చరిత్రలో నిలిచిపోనా
కాలాన్ని తెలియకుండా గడిపేయనా
కలలో నావాడితో
కలిసైనా ఉంటా