612..
ఒక్కసారి నిను చూస్తే..మనసు ఆగి పోతుంది..!
ఒక్కసారి నువు చూస్తే..బ్రతుకు పండి పోతుంది..!
కోటి ప్రేమ కథల గూడు..చిన్ని గాలిబుడగ కదా..!
నీ స్నేహం కరువైతే..ఆశ చితికి పోతుంది..!
పరిమళించు పూలరథం..తనువన్నది నిజమేను..!
నీవు హత్తుకోకుంటే..తనే అలిగి పోతుంది..!
మంచుపూల తేనియలను..గ్రోలాలను ముచ్చటేల..?!
నిన్ను మరచి నిదురిస్తే..నివురు నవ్వి పోతుంది..!
ఇంద్రచాప హాసాలను..పెదవులపై నిలిపేవా..!
వెర్రితనం చిగురిస్తే..మట్టి మరిగి పోతుంది..!
నీ సన్నిధి మురిపాలను..అందించర 'మాధవుడా'..!
నీ సాక్షిగ మిగిలేందుకు..శ్వాస ఒదిగి పోతుంది..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు