ప్రేమ కన్నా మధురం by శ్రవణ్ కుమార్ సమరెడ్డి (CRTL కవితల పోటీ 2021)
శ్రవణ్ కుమార్ సమరెడ్డి
ప్రేమ కన్నా మధురం
ప్రేమకు ప్రతిరూపం అమ్మ అయితే.,
ఆ ప్రేమను పంచే అమ్మ, ప్రేమ కన్నా మధురం.
అదే ప్రేమను పంచే ఒక అమ్మాయి ఉంటే.,
అచ్చం అమ్మలాంటిదైతే అపుడా అమ్మాయి, ప్రేమ కన్నా మధురం.
ప్రేమ ఒక తీయని అనుభూతి కలిగిస్తే.,
మనసు పరవశిస్తే, ఆ క్షణం ప్రేమ కన్నా మధురం.
ప్రేమ మధుర జ్ఞాపకాలను అందిస్తే.,
అవి మన చిరునవ్వుకు వరమైతే, ఆ స్మృతులు ప్రేమ కన్నా మధురం.
స్నేహ బంధానికి ప్రేమ బలమైతే.,
ఆ బలం స్నేహానికి తోడైతే, అపుడా స్నేహం ప్రేమ కన్నా మధురం.
వీటన్నీంటికి కారణం ప్రేమైతే.,
వాటికో అర్థాన్నిచ్చిన ప్రేమ, ప్రేమ కన్నా మధురం..