శీర్షిక : కట్టెల పొయ్యి
కణకణమనే మంట
అనాదిగా ఆకలి తీర్చే వంట
దేహాలు మారినా
జీవాన్ని నడిపించే సాధనమంట
తరతరాల సంపద అంట!
ఊపిరి సలపని పొగతో
కళ్ళల్లో కడలి పోటు రేపిన
గుండెలవిసేలా ఊదిన
రాజుకోనిమంట!
ఎగిసేనో కుండలన్నీ మసికి ఆహుతి అంట!
నాలుగు కట్టెలను పొయ్యిలో పెడితే
తీరేను కడుపుమంట!
వెలిసిన బ్రతుకులకు తార్కాణంగా
ఇంటి చూలకు పట్టి ఉయ్యాలలూగే బూజులతో
చితికిన జీవితానికి నిదర్శనమై
గోడల మీద నిలిచిన నల్లటి చిత్రాలు!
అయినా కాలే కడుపుకి భరోసా ఇచ్చే
ఇంధనాలు... ఈ కట్టె పొయ్యలు!
గ్యాస్ బండల ధర పెరుగుతుందనే భయం లేకుండా
వానాకాలం ఇంటికి హీటర్‌గా
పిల్లులకు షెల్టర్‌గా మారి
మసిబారిన పాత్రలకు చిహ్నమే ఈ పొయ్య
మాయమైన కట్టెల పొయ్య!
జ్యోతి మువ్వల
13/10/21