379..
ఎంత చిలిపి దీరేయీ..కన్ను గీటి పిలుస్తోంది..!
ఎంత కొంటె దీరేయీ ..మనసు మీటి పిలుస్తోంది..!
గూటిలోని చిలుకమ్మను సిగ్గులేల ముంచేనో..!
ఎంత మేటి దీరేయీ..వలపు నిలిపి పిలుస్తోంది..!
సాటిలేని అందాలకు..కోవెలైన కొమలిరో..!
ఎంత తీపి దీరేయీ..సొగసు పరచి పిలుస్తోంది..!
అలసటలను మరపించే నెచ్చెలియే తానాయెనె..!
ఎంత ఘాటు దీరేయీ..మత్తు చల్లి పిలుస్తోంది..!
మౌనాలను శృతి చేసే..సుస్వరాల గగనమాయె..!
ఎంత వెర్రి దీరేయీ..మధువు లొలికి పిలుస్తోంది..!
'మాధవు'డా..నవ వసంత బృందావన చిత్త చోర..!
ఎంత మంచి దీరేయీ..నన్ను కోరి పిలుస్తోంది..!