418..
చల్లగా పిలచినది.. మేఘమే.. ప్రియతమా..!
తియ్యగా వలచినది.. హృదయమే.. ప్రియతమా..!
కలహంస కదిలినది.. లీలగా మనసులో..!
పాటగా పొంగినది.. స్నేహమే.. ప్రియతమా..!
స్వప్నమా చెదరకే..క్షణమైన జన్మలో..!
పదముగా ఉబికినది.. మౌనమే.. ప్రియతమా..!
చినుకు ఎద లోయలో.. దాగున్న భావమా..!
బ్రతుకుగా వెలిగినది..బంధమే..ప్రియతమా..!
మట్టికే పరిమళం నింపెనే మధురిమో..!?
స్వరముగా చిందినది..రాగమే.. ప్రియతమా..!
'మాధవా'..! వేణువై నిలువనీ మోవిపై..!
రాధగా మిగిలినది..దేహమే.. ప్రియతమా..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు