550..
కాలానికి గుణపాఠం చెప్పాలని గొడవెందుకు..!?
స్నేహానికి చిరునామా పట్టాలని గొడవెందుకు..!?
'కుడితిబడ్డ ఎలుక'లాంటి బ్రతుకెందుకు పనికివచ్చు..?!
లోకంలో మెప్పేదో పొందాలని గొడవెందుకు..!?
తాటిచెట్టు క్రింద ఉండి నీడకొరకు అంటావేం..?!
నీ మాటే నిజమైనా..నమ్మాలని గొడవెందుకు..!?
నీ పని నువు చేయడమే తెలిసిందా..రాదలసట..!
ఓటమసలు లేనప్పుడు..గెలవాలని గొడవెందుకు..!?
పాకాలకు రుచులకొరకు..పరుగులింక చాలుకదా..!
మనసులోని మనసునలా..దాచాలని గొడవెందుకు..!?
డబ్బు పైని మోజు పెరిగి..ఎన్ని కోట్లు పొందావో..?!
'మాధవు'నే తెలియలేక..ఎదగాలని గొడవెందుకు..!?
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు