4584..గజల్
బాలలనే ధీరులుగా..మలచుశక్తి కలానిదే..!
సంప్రదాయ విలువలన్ని..నిలుపుశక్తి కలానిదే..!
స్వాతంత్య్ర భరతావనికి..రజతోత్సవ వేడుకలే..
నాయకులను నిగ్గదీయు..ఘాటుశక్తి కలానిదే..!
కవిలోకం గురువులుగా..ఎదిగితేనె పరమార్థం..
బాలభారతాన్ని తీర్చి..దిద్దుశక్తి కలానిదే..!
ధర్మాన్నే స్థాపించగ..విప్లవించు గళాలేవి..
స్వార్థ పిశాచాల మదం..అణచుశక్తి కలానిదే..!
దాశరథి..సినారే కాళోజీలే..ఆదర్శం..
అక్షరాల నినదిస్తూ..కుదుపుశక్తి కలానిదే..!
దేశభవిత కాపాడగ..పనిచేసే యువత ఏది..
వెన్నుతట్టి మేల్కొలిపే..పలుకుశక్తి కలానిదే..!
కార్మిక శ్రామిక కర్షకు..లంతా మాధవ సములే..
ప్రజాశక్తి నడుపు మెఱుపు..ఓటుశక్తి కలానిదే..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు