కాదంబరి శ్రీనివాసరావు
బలమైన బంధం

అంశం: స్నేహం
శీర్షిక: బలమైన బంధం

చేతికి వేళ్ళులా స్నేహం తాడు దారాలు
మానవాళి నడుమ బలమైన బంధం
ధనిక, పేద తారతమ్యాలు
దరి చేరనీయనిది
కుల, మతాల కూతకు బహు దూరమైనది

ఆపదలో నేనున్నానని
వెన్నుతట్టి నిలిచేది
నమ్మకానికి ఊపిరై మెలిగేది
నిన్ను నిలబెట్టడానికి తాను ఆధారమై..
నీ అభివృద్ధి తన జీవితాశయమై..
నీ గెలుపులో తనను చూసుకుంటూ
మురిసి మెరిసిపోయేది
త్యాగానికి వెనుకాడనిది

నీఊహలే తన ఊపిరిగా సాగుతూ..
నీ ఆనందమయ పల్లకీని మోసే బోయి
నీకు రక్షణకవచమై..
కన్ను చాటులేని కాపుకాస్తూ..
ఆదమరపు కలలోకూడా
చెంతకు చేరనీయని ఆత్మబంధువు

నిరంతరం వర్ధిల్లే జీవకోటి దైవకల్పిత వరం
సృష్టి ఉన్నంతకీ నాశం లేనిది
ప్రతిఫలమాశించని స్నేహం
కాలం చెల్లితే కట్టె కాలిపోతుంది
కానీ కాలాతీతమైనది
నిత్యనూతనంగా వెలిగే స్నేహం మాత్రమే!

రచనకు మీ మార్కులు ఇవ్వండి. పోటీ లో ఉన్న రచనలకు ఈ మార్కులు ప్రభావితం చేస్తాయి. బాగా అలోచించి మార్కులు ఇవ్వండి.
0
0
0
0
0
0
0
0
0
0
0
No votes have been submitted yet.
విశాఖపట్నం

కె.శ్రీనివాసరావు, ఫ్లాట్ నెంబర్:202, అమృతసాయి అపార్ట్మెంట్స్, తిమ్మాపురం-531083, S. రాయవరం మండలం, విశాఖ జిల్లా