473..
చిరుగాలికి పాట నేర్పు ~ నేర్పు నీది ఓ చెలియా..!
చీకటులకు తెరలు దింపు ~ ఓర్పు నీది ఓ చెలియా..!
సాక్షియైన మౌన వేణు ~ నాదానివి నీవేగా..!
మనసు మాటు ఆట నిలుపు ~ ఒడుపు నీది ఓ చెలియా..!
కొనగోటన గగనాలను ~ తేలించే జాణవులే..!
కోరికలను తీర్చి చూపు ~ కొలువు నీది ఓ చెలియా..!
పరుగుతీయు పరిమళాల ~ రథమదిగో..నీ నగవే..!
దీపాలకు ఊపిరూదు ~స్వరము నీది ఓ చెలియా..!
శాంతిమధువు పంచిపెట్టు ~ కలహంసల కోవెలలో..
నాట్యమాడు భావాలకు ~ వెలుగు నీది ఓ చెలియా..!
నను 'మాధవ'సీమలోన ~ విహరింపగ వరమిడితివె..!
నా'నే'నది వీడు కొరకు ~ తపము నీది ఓ చెలియా..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు