603..
నీ బొమ్మను గీయాలని..ఆశ చెలీ..చిక్కవేమి..?!
నీతో మాటాడాలని..కోర.. చెలీ..పలుకవేమి..!?
అర్థమసలు ఎక్కడుంది..నేను తీయు పరుగులలో..!?
నాతో నీవుండాలని..ధ్యాస..చెలీ..ఆగవేమి..?!
చిన్నిబుడగ జీవితాన..అందమైన పడగలెన్నొ..?!
నీతోనే ఆడాలని..చూడ..చెలీ..దక్కవేమి..?!
అలలనురగ అంటుతున్న..తీరానికి సాక్షిఎవరొ..?!
నీవు నేను కలవాలని..తలచ..చెలీ..అందవేమి?!
మౌనవీణ మీటుతున్న..నా శ్వాసల మహరాణీ..!!
నీ సన్నిధి చేరాలని..అడుగ..చెలీ..చూడవేమి..?!
ఆ'మాధవ' పదములనే ముద్దాడే..ప్రియ రాధా..!!
నా ఎద నీవేలాలని.. వేడ..చెలీ..ఉలుకవేమి..?!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు