232..
నా ఊహల మబ్బులలో ఎన్ని మోహ చిత్రాలో..?!
నీ వాడని మెరుపులలో ఎన్ని ప్రేమ చిత్రాలో..?!
నాకోసం దిగి వచ్చిన అపరంజివి నీవు కదా..!!
నీ తియ్యని నవ్వులలో ఎన్ని భావ చిత్రాలో..?!
నా ఆటలు..నా పాటలు నీవు లేక సాగవులే..!!
నీ వెచ్చని తలపులలో ఎన్ని హావ చిత్రాలో..!?
కలనైనా విసిగించని వెన్నెలమ్మ నీవేలే..!!
నీ చల్లని చూపులలో ఎన్ని వర్ణ చిత్రాలో!?
నా శ్వాసల ఊయలలో నిదురెరుగని పాపాయీ..!!
నీ చక్కని సొగసులలో ఎన్ని రాగ చిత్రాలో..?!
'మాధవు'డే నీ ప్రియుడని తెలిసెనులే..ఓ రాధా..!!
నీ వీడని అడుగులలో ఎన్ని దివ్య చిత్రాలో..!!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు